వాతావరణ కాలుష్యానికి కేరాఫ్ అడ్రెస్.. అగ్రస్థానంలో ఢిల్లీ.. హైదరాబాద్‌లో..?

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (13:35 IST)
మనదేశం వాతావరణ కాలుష్యానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. దీంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి వుందనే చెప్పాలి. ఎందుకంటే..? వరల్డ్ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌ 2020 (ఐక్యూ ఎయిర్‌) పేరిట ఓ స్విస్‌ సంస్థ రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. దేశంలో ప్రమాద ఘంటికలు మోగించింది. మనదేశంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో కళ్ల ముందు వచ్చింది.
 
ఆ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 30 కాలుష్య పీడిత నగరాల్లో(మోస్ట్ పొల్యూటడ్ సిటీస్) 22 మన భారత దేశంలోనే ఉన్నాయి. అత్యంత కాలుష్య పీడిత రాజధాని నగరంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఈ నివేదిక ప్రకారం.. ఢిల్లీ వాయు నాణ్యత 2019 కంటే 2020లో దాదాపు 15 శాతం మెరుగైంది. 
 
అయినా ఢిల్లీ ప్రపంచ కాలుష్య పీడిత నగరాల్లో పదో స్థానంలో, రాజధాని నగరాల్లో అగ్రస్థానంలో ఉండటం ఆందోళనకరం. ప్రపంచంలో మోస్ట్ పొల్యూటడ్ కంట్రీస్ విషయానికి వస్తే భారత్ మూడో స్థానంలో నిలిచింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం హైదరాబాద్‌లో రెండున్నర రెట్లు అధికం. బెంగళూరు, చెన్నై కంటే ఈ కాలుష్యం హైదరాబాద్‌లోనే ఎక్కువ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments