Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెడ్రూంలో ప్రియుడితో భార్య, మూర్ఛ మొగుడిని అలా చంపేసింది...

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (13:22 IST)
కట్టుకున్న భార్య లేదా భర్త అనారోగ్యం పాలైతే కళ్లలో పెట్టుకుని చూసుకుంటారు. కానీ ఈ భార్య కట్టుకున్న భర్తను కాటికి పంపేసింది. ప్రియుడు మోజులో పడి అతడితో కలిసి భర్త తలపై ఇనుప రాడ్డుతో మోది చంపేసింది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... కర్నాటక రాజధాని బెంగళూరు పరిధిలోని వర్తూరు సిద్దాపుర నివాసి 38 ఏళ్ల పుష్పావతి, 40 ఏళ్ల భర్త చంద్రశేఖర్. చంద్రశేఖర్ అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. ఏడేళ్ల క్రితం ప్రమాదవశాత్తూ అతడి తలకి తీవ్ర గాయమైంది. ఇక అప్పట్నుంచి అతడికి మూర్ఛ వ్యాధి పట్టుకుంది. ఉన్నట్లుండి పడిపోయేవాడు.
 
అలా భర్త పడిపోయినప్పుడు సాయం చేసేందుకు పక్కింటి నుంచి 42 ఏళ్ల మను అనే వ్యక్తి వస్తుండేవాడు. అలా వస్తూవస్తూ చంద్రశేఖర్ భార్య పుష్పావతిపై కన్నేశాడు. చాలా తక్కువరోజుల్లోనే ఆమెని లొంగదీసుకున్నాడు. భర్త లేనప్పుడే కాదు... ఉన్నప్పుడు కూడా ఆమె వద్దకు వస్తుండటాన్ని చూసి భర్తకు అనుమానం వచ్చింది. నిలదీయడంతో ఇక లాభం లేదనుకుని భర్తను చంపేయాలని ప్లాన్ వేసింది.
 
ఈ క్రమంలో మనుని ఇంటికి పిలిచి భర్త నిద్రపోగానే ఇనుప రాడ్డు తీసుకుని తలపై మోది హత్య చేసారు. ఆ తర్వాత అతడి శవాన్ని బాత్రూంలో పడేశారు. వెంటనే ఏడుస్తూ.. తన భర్త మూర్ఛ రావడంతో బాత్రూంలో పడి తల పగిలి చనిపోయాడంటూ అత్తకి ఫోన్ చేసి చెప్పింది. ఐతే పక్కింటివాడితో సన్నిహితంగా వున్నట్లు గతంలోనే గమనించిన చంద్రశేఖర్ బంధువు వారి వ్యవహారంపై ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకుని తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments