Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెహ్రూ రాసిన లేఖలు తిరిగి అప్పగించాలి : రాహుల్‌కు పీఎంఎంఎల్ లేఖ

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (12:22 IST)
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలను తిరిగి అప్పగించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ప్రధానమంత్రి సంగ్రహాలయ - పీఎంఎంఎల్) లేఖ రాసింది. ఈ లేఖలను గత 2008లో పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తీసుకున్నారని, తిరిగి అప్పగించే విషయంలో సహకరించాలని కోరింది.  
 
చరిత్రక ప్రాముఖ్యత కలిగిన నెహ్రూ లేఖలను జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. అయితే 2008లో 51 బాక్సుల్లో ప్యాక్ చేసిన వాటిని సోనియాగాంధీకి పంపారు. అప్పటి నుంచి అవి ఆమె వద్దే ఉన్నాయి. వాటిని తిరిగి అప్పగించాలని సెప్టెంబరులోనే పీఎంఎంఎల్ కోరింది. మరోసారి రాహుల్‌కు డిసెంబరు 10వ తేదీన అదేతరహా అభ్యర్ధన చేసింది. కనీసం ఫొటో కాపీస్ లేక డిజిటల్ కాపీస్ అయినా అందించాలని అడిగింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
నెహ్రూ, ఎడ్వినా మౌంట్ బాటెన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయ లక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ వంటి ప్రముఖుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిలో ఉన్నాయి. జాతి నిర్మాణంలో కీలకభూమిక పోషించిన ప్రధానుల జ్ఞాపకాలతో ప్రధాని సంగ్రహాలయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments