Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిందూ - ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ కుట్ర : రాహుల్ గాంధీ

Rahul Gandhi

ఠాగూర్

, బుధవారం, 27 నవంబరు 2024 (16:54 IST)
హిందూ - ముస్లింల మధ్య మళ్లీ చిచ్చుపెట్టడానికి భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని ఉపయోగిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జామా మసీదు సర్వే సందర్భంగా ఆదివారం చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఐదుగురి మృతిపై ఆయన సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వానిది పూర్తిగా పక్షపాత ధోరణి అని విమర్శించారు. 
 
'మసీదు సర్వే విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. అన్నివర్గాలతో ఎందుకు చర్చించలేదు? ప్రభుత్వం భారతదేశాన్ని ఐక్యత వైపు తీసుకెళ్లాలి. మతతత్వాన్ని రెచ్చగొట్టకూడదు' అని వ్యాఖ్యానించారు. మరోవైపు, సంభాల్లో మరణాల సంఖ్య ఐదుకు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరి శరీరాల్లో దేశవాళీ తుపాకీ బుల్లెట్లు లభ్యమయ్యాయన్నారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి సంభాల్ ఎంపీ జియా-ఉర్-3 హ్మాన్ బార్క్, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్‌పైనా కేసులు పెట్టినట్లు చెప్పారు. 
 
'మొత్తం ఏడు కేసుల్లో 2,750 మందిని నిందితులుగా చేర్చాం. ఇప్పటివరకు ఇద్దరు మహిళలు సహా.. 25 మందిని అరెస్టు చేశాం' అని పేర్కొన్నారు. సంబాల్లో శాంతిభద్రతల నియంత్రణకు అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 30 వరకు బయటివారు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలెవరూ సంబాల్లోకి అడుగుపెట్టకూడదని నిషేధం విధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?