Webdunia - Bharat's app for daily news and videos

Install App

NEET 2023: నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్ 06 చివరి తేదీ

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (10:35 IST)
జాతీయ స్థాయి ఎంట్రెన్స్ టెస్టుల్లో అత్యంత కఠినమైనదిగా నీట్‌ని భావిస్తారు. ఇందులో క్వాలిఫై అవ్వాలంటే విద్యార్థులు చాలా శ్రమించాలి. దేశంలోని మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికి నీట్‌ను అర్హత పరీక్షగా నిర్వహిస్తున్నారు. 
 
తాజాగా నీట్-2023 యూజీ నోటిఫికేషన్ విడుదలైంది. మే 7వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 06,2023గా నోటిఫికేషన్‌లో పేర్కొనడం జరిగింది. 
 
నీట్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో జరగనుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. నీట్‌ ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. 
 
ఎగ్జామ్‌లో మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్షలో మూడు సెక్షన్స్ ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మొత్తం 720 మార్కులకు ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments