Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో 'నీట్‌ 2021'

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (08:02 IST)
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ 2021 పరీక్షను రద్దు చేసే అవకాశం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2021లో జరిగే సిబిఎస్‌, జెఇఇమెయిన్‌ నీట్‌ పరీక్షలపై నెలకొన్న సందేహాలకు సమాధానాలిచ్చారు.

జెఇఇ మెయిన్స్‌ ఏడాదికి మూడు, నాలుగు సార్లు నిర్వహించే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటున్నట్లు రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నందున పాఠశాలలు పున:ప్రారంభిస్తామని, ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించాయని అన్నారు.

ఈ ఏడాది నీట్‌ పరీక్షా కేంద్రాలను మరిన్ని పెంచుతామని, విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తామని అన్నారు. ఇప్పటికే నీట్‌ను మూడుసార్లు వాయిదా వేశామని, ప్రస్తుత పరిస్థితుల్లోనూ రద్దు చేయవచ్చు. అలా చేస్తే విద్యార్థులకు భారీ నష్ట కలుగుతుందని అన్నారు.

ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లోనే నీట్‌ పరీక్ష జరుగుతోందని, విద్యార్థులు ఆన్‌లైన్‌లో జరగాలని కోరుకుంటే ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తామని అన్నారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments