Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ సురక్షితం.. ఫోటో రిలీజ్ చేసిన మావోలు

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:42 IST)
మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా ఉన్నారు. ఈ మేరకు ఆయన ఫోటోను మావోయిస్టులు తాజాగా విడుదల చేశారు.  
 
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ - సుక్మా అటవీప్రాంతంలో నక్సల్స్, భద్రతా బలగాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో రాకేశ్వర్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో‌ గల్లంతయ్యారు. ఆయనను మావోలు బందీగా ఉంచున్నారు.
 
అయితే, ఆయన ఆచూకీపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాకేశ్వర్ సింగ్ తమ అధీనంలోనే సురక్షితంగా ఉన్నాడని మావోయిస్టులు ఇప్పటికే ప్రకటించారు. 
 
తాజాగా రాకేశ్వర్ సింగ్ క్షేమంగా ఉన్నాడంటూ ఓ ఫొటోను విడుదల చేశారు. ఓ చిన్న తాటాకుల పాకలో విశ్రాంతి తీసుకుంటున్న కమాండో ఆ ఫొటోలో దర్శనమిచ్చాడు. 
 
రాకేశ్వర్ సింగ్ ఎవరితోనో మాట్లాడుతుండగా ఫొటోను క్లిక్ మనిపించినట్టు తెలుస్తోంది. అతడి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించకపోవడాన్ని బట్టి మావోలు బాగానే చూసుకుంటున్నారని తెలుస్తోంది. 
 
పోలీసులు తమ శత్రువులు కారని, ప్రభుత్వ విధానాలనే తాము వ్యతిరేకిస్తున్నామని మావోయిస్టు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పైగా, రాకేశ్వర్ సింగ్‌ను విడుదల చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments