Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ ఇండియా స్టేట్స్ కంటే పాకిస్థాన్ బెట్టర్ : నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (10:06 IST)
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేతగా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ప్రధాని అయిన సందర్భంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లారు. దీనిపై స్వదేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. వీటిని తన వాగ్ధాటితో సిద్ధూ కౌంటర్ వేశారు. 
 
ఈ నేపథ్యంలో సిద్ధూ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోమారు వివాదాస్పదమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించడం కంటే పొరుగునున్న పాకిస్థాన్‌కు వెళ్లడమే మంచిదంటూ తూలనాడారు. 'పాకిస్థాన్‌ సంస్కృతికి, దక్షిణాది సంస్కృతికి చాలా తేడా ఉంది. తమిళంలో వణక్కం వంటి ఒకట్రెండు పదాలు తప్ప ఏమీ అర్థంకాదు. పాక్‌లో పంజాబీ, ఇంగ్లిషే మాట్లాడతారు' అంటూ వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, పాక్‌ నిజంగానే కర్తాపూర్‌ సాహెబ్‌ గురుద్వారలోకి భారత సిక్కులకు ప్రవేశం కల్పిస్తే.. కౌగిలింతతోపాటు.. ఈసారి ముద్దు కూడా పెడతానంటూ ఆయన బాహాటంగా ప్రకటించారు. మంచి మాటల చమత్కారి అయిన నవజ్యోత్ సింగ్‌కు ఆ మాటలే ఇపుడు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments