Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ డ్రైవింగ్ నేర్పిస్తానని మహిళపై పార్కింగ్ చేసిన బస్సులో బలాత్కారం!

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (09:43 IST)
దేశంలో కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చి అమలు చేస్తున్నా వాటివల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. మహారాష్ట్రలో తాజాగా 19 యేళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది కూడా ఆమె స్నేహితులే కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నవీ ముంబైలోని ఖర్గార్‌కు చెందిన 19 యేళ్ళ యువతికి బైక్ డ్రైవింగ్ నేర్పిస్తానని ఇద్దరు స్నేహితులు నమ్మించారు. దీంతో వారి మాటలు నమ్మి బైక్ నేర్చుకునేందుకు వెళ్ళింది. అయితే, ఆ యువతిని ఖర్గార్‌లోని ఉత్కర్ష్ హాలు సమీపంలో ఆపి ఉంచిన బస్సులోకి తీసుకువచ్చాడు. 
 
అక్కడ ఆ యువతితో బలవంతంగా మద్యం తాగించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పిజ్జా డెలివరీ బాయ్‌ను కూడా పిలిపించాడు. డెలివరీ బాయ్ కూడా మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం మహిళను బస్సులోనే వదిలి పారిపోయారు. 
 
బాధిత మహిళ మరుసటిరోజు విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన పిజ్జా డెలివరీ బాయ్‌ను అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు డ్రైవరు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ముంబై పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments