Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్‌కు పొగాకు సెగ... ఆ ప్రచారం నుంచి తప్పుకోండంటూ లేఖ

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (09:54 IST)
బాలీవుడ్ అగ్ర నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు సెగతగిలింది. పాన్ మసాలా ప్రచార ప్రకటన నుంచి వైదొలగాలంటూ నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనేషన్ (జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ) ఘాటైన లేఖను సంధించింది. 
 
పొగాకు, పాన్ మసాలా వ్యసనం పౌరుల ఆరోగ్యాన్ని క్షీణిస్తుందని వైద్య పరిశోధనల్లో తేలిందని, అందువల్ల పాన్ మసాలాలను ప్రోత్సహించే ప్రకటనల ప్రచారం నుంచి వైదొలగాలని కోరుతూ ఈ సంస్థ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ అమితాబ్‌కు లేఖ రాశారు.
 
ఈ లేఖలో... 'అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ అని, అతను వీలైనంత త్వరగా పాన్ మసాలా ప్రకటనల నుంచి తప్పుకోవాలి. పొగాకు వ్యసనం నుంచి యువత దూరంగా ఉండటానికి ఈ చర్య సహాయపడుతుంది' అని పేర్కొన్నారు. 
 
'పాన్ కేన్సర్ కారకంగా పనిచేస్తోందని ఇటీవలి పరిశోధనలో తేలింది, తమలపాకులోని పదార్థాలు శరీరంలో కేన్సర్ కారకాలుగా మారి నోటి కేన్సర్‌కు దారితీస్తాయని తేలింది. పాన్ మానవులకు కేన్సర్ కారకం అనే శాస్త్రీయ ఆధారాలను ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు నిర్దారించాయి' అని బిగ్ బి కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments