అమ్మకానికి భారత్ : రాహుల్ గాంధీ ధ్వజం

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (08:18 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని కాగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇప్పటికే ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాలను పూర్తి విక్రయానికి కేంద్రం నిర్ణయించిందని వచ్చిన వార్తలపై రాహుల్ సోమవారం ఘాటుగా స్పందించారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భాజపాకు ఎలా నిర్మించాలో తెలియదు గానీ, ఎలా అమ్మాలో మాత్రం పూర్తి అవగాహన ఉందంటూ ట్విటర్‌‌ వేదికగా ఎద్దేవా చేశారు. ప్రైవేటీకరణతో ప్రజలు నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. మోడీ ఆప్తమిత్రులు మాత్రమే లబ్ధి పొందుతారని విమర్శించారు. #IndiaAgainstPrivatisation అనే హ్యష్‌ట్యాగ్‌ జోడించారు.
 
అనేక అంశాలపై ప్రధాని మోడీ సర్కారును రాహుల్ గాంధీ తీవ్రంగా దుయ్యబడుతున్న విషయం తెల్సిందే. ఇపుడు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై ఆయన రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments