Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్నాథ్ రెడ్డి , పులివర్తి నానిల‌ అరెస్ట్ అప్రజాస్వామికం

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (10:09 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో అర్థ రాత్రి వేళ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మరో సీనియర్ నాయకుడు పులివర్తి నానిలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. కుప్పంలోని ఓ హోటల్ లో భోజనం చేస్తున్న పార్టీ నేతలను ఉన్న ఫళంగా అరెస్ట్ చేయడం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు. 
 
 
గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తోందన్నారు. తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి కుప్పం నుంచి బలవంతంగా పంపించి ఎన్నికను ఏకపక్షం చేసుకోవాలన్నది జగన్ రెడ్డి ప్లాన్ అని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆటలు సాగబోవ‌న్నారు. అమర్ నాథ్ రెడ్డి, పులివర్తి నాని అరెస్ట్ అప్ర‌జాస్వామికం అని, అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాల‌ని ఆయ‌న డిమాండు చేశారు.  ప్రజాసామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల‌ టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments