Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌లోకి జంప్ అయిన బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాగంకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (16:05 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాగంకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగం జనార్థన్‌ రెడ్డితో పాటు వేములవాడ బీజేపీ నేత ఆది శ్రీనివాస్‌, ప్రజాగాయకుడు గద్దర్‌ కుమారుడు జి.వి. సూర్యకిరణ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో బుధవారం చేరారు. 
 
నాగం జనార్దన్‌రెడ్డి కొద్దికాలంగా భాజపాకు దూరంగా వుంటూ వచ్చారు. పార్టీ చేపట్టే ఏ కార్యక్రమానికి ఆయన హాజరుకాకుండా వుండటంతో నాగం పార్టీ మారుతారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు నాగం జంప్ అయ్యారు. ఈ సందర్భంగా నాగం జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీదేనన్నారు. రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోనికి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నాగం చెప్పారు. తెరాస సర్కార్ రాష్ట్రంలో నిరంకుశపాలన సాగిస్తోందని విమర్శించారు. ఇచ్చిన హామీలన్నిటినీ కేసీఆర్ సర్కార్ విస్మరించిందన్నారు. కానీ నాగం పార్టీ మారటం వల్ల తమ పార్టీకి కలిగే నష్టమేమీ లేదని బీజేపీ నేతలు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments