తెలంగాణా ఆర్టీసీ బస్సులో ఆ సినిమా చూపించారు... తరువాత..?
కొత్త సినిమాలు ఈ మధ్య కాలంలో విడుదలైన కొద్దిసేపటికే డివిడిల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తే ఫైరసీదారులు మాత్రం గంటల్లోనే ఆ సినిమాలను డివిడిలుగా చేసి తక్కువ రేటుకే అమ్మేసి డబ్బులు సంపాదిచేస్తున్నారు.
కొత్త సినిమాలు ఈ మధ్య కాలంలో విడుదలైన కొద్దిసేపటికే డివిడిల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తే ఫైరసీదారులు మాత్రం గంటల్లోనే ఆ సినిమాలను డివిడిలుగా చేసి తక్కువ రేటుకే అమ్మేసి డబ్బులు సంపాదిచేస్తున్నారు. అలాంటి సంఘటనే తెలంగాణా రాష్ట్రంలో జరిగింది.
హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళుతున్న ఒక తెలంగాణా ఆర్టీసీ బస్సులో నాని నటించిన శ్రీక్రిష్ణార్జున యుద్థం సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాను ఒక యువకుడు ఫోటో తీసి కెటిఆర్‌కు ట్వీట్ చేశాడు. దీంతో కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్‌డికి స్వయంగా ఫోన్ చేసి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం.
పైరసీని అడ్డుకోవాల్సిన మనమే.. ఆ పైరసీని ప్రోత్సహించడం మంచిది కాదంటూ చెప్పారు. ఎవరైతే పైరసీ డివిడిలను ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారో వారిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆర్టీసీ ఎమ్‌డిని కోరారు కెటిఆర్.