తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

ఠాగూర్
మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (17:24 IST)
తల్లి స్థానం దేవుడి కంటే గొప్పదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భౌతికంగా మన మధ్య లేని తన తల్లి హీరా బెన్‌ మోడీని కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారని మోడీ భావోద్వేగంతో స్పందించారు. అది కేవలం తన తల్లికి జరిగిన అవమానంమ మాత్రమే కాదని, దేశంలోని కోట్లాది మంది తల్లులు, సోదరీమణులను కించపరచడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేసింది. బీహార్‌లో ఇటీవలి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు బీజేపీ ఆరోపించింది. 
 
మంగళవారం నాడు బీహార్‌కు చెందిన సుమారు 20 లక్షల మంది మహిళలతో వర్చువల్ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు పాల్గొన్న సభలో నా తల్లిని దూషించారు. ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. బీహార్ ప్రజలు కూడా ఈ వ్యాఖ్యలతో బాధపడ్డారని నాకు తెలుసు అని అన్నారు.
 
తన తల్లి పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ.. మా బట్టల కోసం ప్రతి పైసా కూడబెట్టేది. అనారోగ్యంతో ఉన్నా పనిచేసి కుటుంబాన్ని పోషించేది. దేశంలో అలాంటి తల్లులు కోట్లాది మంది ఉన్నారు. తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది అని మోడీ ఉద్వేగానికి లోనయ్యారు. కాగా, మోడీ తల్లిపై వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతు పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments