Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తిన్న పాపం.. చికెన్ ముక్క అలా చిక్కుకుంది.. 8 గంటలు సర్జరీ

సెల్వి
శుక్రవారం, 7 మార్చి 2025 (11:57 IST)
బిర్యానీ తిన్న పాపానికి ఓ మహిళ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. కుర్లాకు చెందిన 34 ఏళ్ల రూబీ షేక్ అనే మహిళ తన బిర్యానీ నుండి చికెన్‌ ఎముక గొంతులో చిక్కుకోవడంతో 8 గంటల పాటు శస్త్రచికిత్స చేయించుకుంది. ఫిబ్రవరి 3న రూబీ తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. 
 
3.2 సెం.మీ.ల చికెన్ ఎముక ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో తీవ్రనొప్పిని ఆమె ఎదుర్కొంది. ఈమెకు ఇఏడేళ్ల కూతురు, ఆరు నెలల కొడుకు ఉన్నారు. రూబీకి ఈ చికెన్ ముక్క గర్భాశయ వెన్నెముక ప్రాంతం దగ్గర C4-C5 వెన్నుపూస డిస్క్‌ల మధ్య చిక్కుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఎక్స్-రేలో చికెన్ ముక్క చిక్కుకున్న విషయాన్ని గమనించిన వైద్యులు ఫిబ్రవరి 8వ తేదీన సర్జరీ ద్వారా దానిని వెలికి తీశారు.
 
ఈ శస్త్రచికిత్స చాలా క్లిష్టమైనది, వైద్య రంగంలో ఇటువంటి కేసులు అసాధారణమని వైద్యులు పేర్కొన్నారు. వైద్య ఖర్చుల కారణంగా రూబీ కుటుంబం గణనీయమైన ఆర్థిక భారాన్ని ఎదుర్కొంది.మొత్తం మీద దాదాపు రూ. 8 లక్షలు. అయితే, ఆసుపత్రి విరాళం ద్వారా దానిని సగానికి తగ్గించింది. 
 
పెద్ద శస్త్రచికిత్స తర్వాత కోలుకునే ప్రక్రియలో భాగంగా రూబీకి ఒక నెల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ 'అసాధారణ కేసు'ను ఒక వైద్య పత్రికలో ప్రచురించాలని ఆయన యోచిస్తున్నారు. ఈ చేదు అనుభవం కారణంగా ఇకపై బిర్యానీ తిననని రూబీ షేక్ పేర్కొంది. ఆమె తన భర్తకు ఇకపై ఎప్పటికీ బిర్యానీ వండనని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments