Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి మోసం చేశాడు.. ప్రేమ కానుక పంపుతానని రూ.3లక్షల మోసం

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (13:20 IST)
ఓ మహిళను ప్రేమించి మోసం చేసి రూ.3.68 లక్షలు మోసం చేసిన నకిలీ ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 51 ఏళ్ల వివాహిత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అలెక్స్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చివరికి అది ప్రేమగా మారింది. ఇద్దరు తరచుగా మాట్లాడుకుంటున్న సమయంలో మహిళ అలెక్స్‌కు తన ఫోటోను కూడా షేర్ చేసింది. 
 
ఈ సందర్భంలో, అలెక్స్ ప్రేమికుల రోజు కోసం మహిళకు బహుమతి పంపినట్లు చెప్పాడు. ప్రేమికుడి ప్రేమ కానుక కోసం ఆ అమ్మాయి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అనంతరం కొరియర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్న వ్యక్తి పార్శిల్ అదనపు బరువు ఉన్నందున రూ.72 వేలు చెల్లించాలని చెప్పాడు. మహిళ కూడా చెల్లించింది తర్వాత మళ్లీ కాల్ వచ్చిందని, ప్రేమ బహుమతిలో యూరో కరెన్సీ నోట్లు ఉన్నాయని, ఈ సమాచారం కస్టమ్స్‌కు వెళ్లకుండా ఉండేందుకు రూ.2.65 లక్షలు చెల్లించాలని చెప్పారు. 
 
భయపడిన మహిళ ఆ మొత్తాన్ని కూడా ఇచ్చింది. మళ్లీ డబ్బులు కావాలని కాల్ రావడంతో మోసపోయానని గ్రహించాడు. ఈ విషయం చెబితే అమ్మాయి ప్రైవేట్ ఫోటోలు బయటపెడతానని అలెక్స్ బెదిరించాడు. సదరు మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో డబ్బు దోపిడీ చేసిన సైబర్ క్రైమ్ ముఠా కోసం వెతుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments