Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో పరిచయం... ముంబై నటిపై రాజస్థాన్‌లో అత్యాచారం...

ముంబైకు చెందిన ఓ నటిపై రాజస్థాన్ రాష్ట్రంలో అత్యాచారం జరిగింది. ఈ లైంగికదాడికి పాల్పడింది సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిన వ్యక్తికావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:05 IST)
ముంబైకు చెందిన ఓ నటిపై రాజస్థాన్ రాష్ట్రంలో అత్యాచారం జరిగింది. ఈ లైంగికదాడికి పాల్పడింది సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిన వ్యక్తికావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ముంబై ఆల్వార్‌కు చెందిన ఓ యువతి అటు మోడలింగ్, ఇటు సినిమాల్లో నటిస్తూ రాణిస్తోంది. ఈమెకు సోషల్ మీడియాలో 25 యేళ్ల ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినేనని ఆమెను నమ్మించాడు. ఇద్దరి మధ్య మాటలు సాగి, పరిచయం మరింతలోతుకు చేరుకున్న వేళ, వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయించుకున్నారు.
 
దీంతో ఆ నటి ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లింది. అతను బాధితురాలిని తన కుటుంబీకులకు, స్నేహితులకు పరిచయం చేశాడు. ఆపై ఇద్దరూ కలసి ఈ నెల 4వ తేదీన రాజస్థాన్‌లోని నీమ్ రానాకు కలసి వెళ్లారు. అక్కడ రాత్రి పూట ఉండేందుకు గదిని అద్దెకు తీసుకున్నారు. 
 
అర్థరాత్రి తర్వాత ఆ నటిపై నీమ్ రానా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తాను మోసపోయినట్టు తెలుసుకున్న బాధితురాలు ముంబైకు చేరుకుని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వ్యక్తికోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు - సినీ దర్శకుడు గీతాకృష్ణపై కేసు

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments