Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్ రేప్...

జ్వరంతో బాధపడుతున్న ఓ జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం డెహ్రాడూన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Advertiesment
జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్ రేప్...
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:54 IST)
జ్వరంతో బాధపడుతున్న ఓ జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం డెహ్రాడూన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ పాఠశాలలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు చదువుకుంటున్నారు. వీరిలో ఒకరు పదో తరగతి చదువుతున్నారు. అయితే పదో తరగతి బాలికకు నెల రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో ఆ బాలికను చూసేందుకు కొంతమంది సీనియర్ విద్యార్థులు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన సీనియర్ విద్యార్థులు.. ఆ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. 
 
ఈ విషయాన్ని ఆ బాధిత బాలిక రహస్యంగా ఉంచింది. అయితే ఆ బాలిక గర్భందాల్చినట్టు తాజాగా తేలింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి సోదరి, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పాఠశాలకు చెందిన ఐదుగురు టీచర్లు, నలుగురు సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీతారామన్‌ను నేను కాల్చిపారేస్తాను. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు....