Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావు బతుకుల్లోనూ లైంగిక వేధింపులు... శవాలపై నగలు చోరీ

ముంబై ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్డు స్టేషన్‌లోని పాదచారుల వంతెన వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మహిళల పట్ల కొందరు కామాంధులు అసభ్యంగా ప్రవర్తించారు. చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ సాయం చేయాలని కోరుతున్న మహ

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (09:29 IST)
ముంబై ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్డు స్టేషన్‌లోని పాదచారుల వంతెన వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన మహిళల పట్ల కొందరు కామాంధులు అసభ్యంగా ప్రవర్తించారు. చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ సాయం చేయాలని కోరుతున్న మహిళను అనుచితంగా తాకుతూ లైంగిక వేధింపులకుపాల్పడ్డారు. ఆ తర్వాత తమదారిన తాము పోయారు. ఇది జరిగిన కొద్ది క్షణాలకే ఆ మహిళ మృతి చెందింది. అలాగే, చనిపోయిన శవాలపై నగలు చోరీ చేశారు. ఈ దారుణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ తొక్కిసలాటలో 23మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఈ తొక్కిసలాటలో చిక్కుకుని కొనఊపిరితో బయటపడిన బాధితులకు ఆపన్నహస్తం అందించేలా చేస్తుంది. కానీ కొందరు వ్యక్తులు మాత్రం మృగాల్లా ప్రవర్తించారు. మహిళా క్షతగాత్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మరికొందరు దుర్మార్గులు చనిపోయిన మహిళల శరీరాలపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 
 
ఈ దారుణ దృశ్యాలను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ఎల్ఫిన్‌స్టోన్‌ ఘటనకు కారణమని, వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. 

సంబంధిత వార్తలు

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం