Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్లపాటు సహజీవనం.. వేరొక యువతితో పెళ్లి.. సినీ ఫక్కీలో పోలీసుల అరెస్ట్.. ఎక్కడ?

పెళ్లి చేసుకునేందుకు పెళ్లికొడుకుగా ముస్తాబైన వరుడు.. వధువు మెడలో మూడు ముళ్లు వేసేందుకు రెడీ అయ్యాడు. అయితే అక్కడే అసలు సీన్ ప్రారంభమైంది. ఆ సమయంలో సినీ ఫక్కీలో అక్కడికి యూనిఫాంలో ఉన్న పోలీసులు రంగప్ర

Webdunia
శనివారం, 6 మే 2017 (11:56 IST)
పెళ్లి చేసుకునేందుకు పెళ్లికొడుకుగా ముస్తాబైన వరుడు.. వధువు మెడలో మూడు ముళ్లు వేసేందుకు రెడీ అయ్యాడు. అయితే అక్కడే అసలు సీన్ ప్రారంభమైంది. ఆ సమయంలో సినీ ఫక్కీలో అక్కడికి యూనిఫాంలో ఉన్న పోలీసులు రంగప్రవేశం చేసి... అత్యాచారం కేసులో నిందితుడైన వరుడి చేతికి బేడీలు వేసి అరెస్టు చేసి తీసుకువెళ్లిపోయారు.

దీంతో మరికొద్ది నిమిషాల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ముంబైలోని శివారు ప్రాంతమైన భైసర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బైసర్ నగరానికి చెందిన 22 ఏళ్ల యువకుడు తన బంధువైన 24 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆరేళ్లుగా సహజీవనం చేశాడు.  చిన్ననాటి నుంచే పరిచయం కలిగిన వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనున్నారు. కానీ సహజీవనం చేసిన వ్యక్తి వేరొక యువతితో పెళ్లికి సిద్ధం కావడంతో.. సహజీవనం చేసిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పెళ్లి చేసుకుంటానని ఆరేళ్లుగా తనపై అత్యాచారం జరిపిన వరుడిపై యువతి కేసు పెట్టింది. దీంతో ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి పెళ్లి వేడుకలో ఉన్న వరుడిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments