Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ కేసులో మైనర్ నిందితుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది. నలుగురు దోషులకు మరణ శిక్ష కూడా ఖరారైంది. ఈ కేసులో ఉన్న మరో ఇద్దరు దోషుల్లో ఒకరు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా మరో బాల నేరస్

Webdunia
శనివారం, 6 మే 2017 (09:44 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది. నలుగురు దోషులకు మరణ శిక్ష కూడా ఖరారైంది. ఈ కేసులో ఉన్న మరో ఇద్దరు దోషుల్లో ఒకరు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా మరో బాల నేరస్తుడు కావడంతో.. మూడేళ్ల పాటు బోస్టన్ స్కూల్లో ఉన్న తర్వాత విడుదల చేసేశారు.

ప్రస్తుతం బాల నేరస్తుడు ప్రస్తుతం చేస్తున్నాడో తెలుసా? కొత్త జీవితంలో సెటిలైపోయాడు. అతడికి ప్రస్తుతం 23 ఏళ్ల వయసు. తన సొంత ప్రాంతానికి దూరంగా దక్షిణాదిన ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియకుండా ఒక ధాబాలో వంటవాడిగా పనిచేసుకుంటున్నాడు. 
 
సుప్రీం కోర్టు తీర్పు రాగానే మరోసారి టీవీ ఛానళ్ల కళ్లన్నీ అతడిమీదే పడతాయి కాబట్టి.. అతడు ఎక్కడున్నాడో కూడా ఎవరికీ చెప్పడం లేదు. చివరకు అతడు పనిచేసే ధాబా యజమానికి కూడా అతడు ఫలానా అని తెలియదు. ఓ స్వచ్ఛంధ సంస్థ మాత్రం జైలు నుంచి విడుదలైన ఏడాది తర్వాత మైనర్ దక్షిణాదిన ఒక ధాబాలో వంటవాడిగా చేర్చినట్లు తెలిపింది. 
 
2015 డిసెంబర్ 20వ తేదీన అతడు విడుదలైన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ఒక స్వచ్ఛంద సంస్థ వద్ద ఉన్నాడు. ఆ తర్వాత వంటవాడిగా వచ్చేశాడు. ఢిల్లీకి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి నుంచి 11 ఏళ్ల వయసులో అతడు పారిపోయి వచ్చేశాడు. ఢిల్లీ వచ్చిన తర్వాత నిర్భయ కేసులో మరో నిందితుడైన రామ్‌సింగ్‌ పంచన చేరాడు. అతడి దగ్గర బస్సు క్లీనర్‌ పనిలో కుదురుకున్నాడు. ఆ సమయంలోనే  నిర్భయ కేసులో నిందితుడయ్యాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments