Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రిస్తున్న పిల్లని మంటల్లో వేసిన రాక్షసుడు...

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (12:43 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రాక్షసుడుగా మారిపోయాడు. హాయిగా నిద్రిస్తున్న పిల్లిని నిప్పుల్లో వేసి రాక్షసానందం పొందాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని భారతీ పార్క్ సమీపంలో ఉన్న నయా నగర్‌కు చెందిన సిద్ధేశ్ పటేల్ అనే వ్యక్తి.. సోమవారం అర్థరాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. 
 
ఆ సమయంలో మెట్ల కింద కొన్ని పిల్లులు హాయిగా నిద్రిస్తున్నాయి. వాటిని చూడగానే ఈ రాక్షసుడుకి ఓ వింత ఆలోచన మొదలైంది. దీంతో వాటిని ఓ బాక్సులో వేసి నిప్పు పెట్టాడు. మంటలకు తాళలేక పరిగెడుతుంటే మళ్లీ వాటిని పట్టుకుని మంటల్లో వేశాడు. కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మంటల్లో కాలిపోతుంటే వికృతానందం పొందాడు. 
 
అతను అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికి అపార్ట్‌మెంట్ వాసులు ఈ దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఈ చర్యను జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments