Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికను ముద్దాడిన వ్యక్తికి ఐదేళ్ల జైలు.. వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (16:59 IST)
మహిళలపై వావివరుసలు, వయోబేధాలు లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. నిర్భయ లాంటి చట్టాలొచ్చినా.. కామాంధుల ఆగడాలు తగ్గట్లేదు. లాక్ డౌన్‌లోనూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలా మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న వ్యక్తికి జైలు ఖాయమైంది. 
 
మైనర్ బాలికను ముద్దాడిన కేసులో ఓ వ్యక్తి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ముంబైలో మైనర్ పిల్లల రక్షణ కోసం ఉద్దేశించిన పోక్సో చట్టం కింద వచ్చిన తొలితీర్పు ఇదే కావడం గమనార్హం. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన అబు అబ్దుల్‌ రెహ్మాన్‌ అనే 30 ఏళ్ల వ్యక్తి.. 2018 జూన్‌ 29న అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌ బాలికను ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం అతడ్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
 
బుధవారం ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును ముంబై స్థానిక కోర్టు వెలువరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు శిక్ష ఖరారు చేసింది. మైనర్‌ బాలిక తనను ముద్దు పెట్టుకుంది అతనే అంటూ కోర్టులో అబ్దుల్‌ను గుర్తు పట్టింది. దీంతో అతడ్ని దోషిగా తేల్చిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments