Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిని "ఐటమ్" అని పిలిచిన యువకుడికి యేడాదిన్నర జైలు

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (11:11 IST)
తనన ఐటమ్ అని పిలిచి లైంగికంగా వేధించాడంటూ కోర్టుకెక్కిన అమ్మాయికి న్యాయం జరిగింది. ఆమెను ఐటమ్ అని పిలిచిన యువకుడికి యేడాదిన్న కాలం జైలుశిక్ష విధిస్తూ ఫోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అమ్మాయిలను అబ్బాయిలు ఇలా ఉద్దేశపూర్వకంగానే పిలుస్తుంటారని, అందువల్ల నిందితుడి విషయంలో కనికరం చూపాల్సిన పనిలేదంటూ అభిప్రాయపడిన కోర్టు జైలు శిక్ష విధించింది. మహారాష్ట్రలో ఈ తీర్పు వెలువడింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముుంబైకు చెందిన 25 యేళ్ల యువకుడు తనను లైంగికంగా వేధించాడంటూ 16 యేళ్ల బాలిక 2015లో కేసు పెట్టింది. 14వ తేదీ జూలై 2015న తన స్కూలు నుంచి ఇంటికెళుతున్న సమయంలో యువకుడు తనను బైకుపై వెంబడించాడని, ఆ తర్వాత జట్టు పట్టుకుని లాగుతూ "ఏం ఐటమ్.. ఎక్కడికెళ్తున్నావ్" అంటూ వేధించాడని పేర్కొంది. 
 
దీనిపై ముంబై ఫోక్సో కోర్టు విచారణ చేపట్టి... అమ్మాయిలను లైంగికంగా వేధించేందుకు అబ్బాయిలు ఉద్దేశపూర్వకంగానే అలా పిలుస్తారని పేర్కొంది. ఇలాంటి రోడ్‌సైడ్ రోమియోలను బుద్ధి చెప్పాల్సిందని వ్యాఖ్యానించింది. నిందితుడి విషయంలో కనికరం చూపాల్సిన ప్రసక్తే లేదని పేర్కొంటూ యేడాదిన్నర జైలుశిక్షి విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం