Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్కె తీర్చలేదని ప్రియురాలితో ఎలుకల మందు తినిపించిన ప్రియుడు

కోర్కె తీర్చలేదని ప్రియురాలితో ఓ ప్రియుడు ఎలుకల మందు తినిపించాడు. అదీ కూడా పీకపై కత్తిపెట్టి బెదిరించిమరీ తినిపించాడు. ముంబై నగరంలోని కంజుమార్గ్ ప్రాంతంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, కంజుమార్గ్ ప్ర

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (09:56 IST)
కోర్కె తీర్చలేదని ప్రియురాలితో ఓ ప్రియుడు ఎలుకల మందు తినిపించాడు. అదీ కూడా పీకపై కత్తిపెట్టి బెదిరించిమరీ తినిపించాడు. ముంబై నగరంలోని కంజుమార్గ్ ప్రాంతంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, కంజుమార్గ్ ప్రాంతానికి చెందిన కిషన్ సోనవానే (24) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ ఐదేళ్లుగా కలిసిమెలిసి తిరిగారు. హద్దులు కూడా దాటారు. అయితే, గత నెల రోజులుగా వీరిమధ్య మనస్పర్థలు పొడచూపాయి. ఫలితంగా కొంత దూరంగా ఉంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో తన ప్రియురాలిని చెంతకు చేరదీసి.. కోర్కె తీర్చమన్నాడు. దానికి ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ప్రియుడు... విఖ్రోలీలోని గార్డెన్‌కు రప్పించాడు. అనంతరం ఆమెకు ఎలుకల మందు బిళ్ల ఇచ్చి దాన్ని తినమని కత్తితో బెదిరించాడు. దీంతో ఆ యువతి దిక్కుతోచక ఎలుకల మందు తిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది. 
 
అంతే పార్కులో ఉన్న తోటి సందర్శకులు ఆమెను హుటాహుటిన మహాత్మాఫూలే మున్సిపల్ ఆసుపత్రికి తరలించారు. మాజీ ప్రేయసి ఆసుపత్రిలో కోలుకుంటుండగా, ప్రియుడు పారిపోయాడు. యువతి ఫిర్యాదు మేర పోలీసులు రంగంలోకి దిగి నిందితుడైన కిషన్ సోనవానేను అరెస్టు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments