Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై రైల్వే స్టేషన్.. ఫ్లాట్‌ఫామ్‌లోనే కాన్పు.. పోలీసులు ఏం చేశారంటే?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (14:27 IST)
ముంబై రైల్వే స్టేషన్‌లోనే ఓ మహిళ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. పోలీసులే ఆ మహిళ కోసం లేబర్ రూమ్ సిద్ధం చేశారు. ఎలాగంటే..? 21 ఏళ్ల మహిళ ఎప్పుడూ బిజీ బిజీగా ముంబై రైల్వేస్టేషన్‌లో క్రిస్మస్‌కు ముందు రోజు డిసెంబర్ 24వ తేదీన పండంటి పాపకు జన్మనిచ్చింది. గీత దీపక్ వాఘ్రే ఆమె భర్త దాదర్ స్టేషన్‌లో పూణే వెళ్లేందుకు గాను వేచి వున్నారు. ఆ సమయంలో గీతకు పురిటి నొప్పులు వచ్చాయి. 
 
ఇక ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. వెంటనే అక్కడున్న పోలీసులు.. ప్రయాణీకులు బెడ్ షీట్లతో లేబర్ రూమ్‌లా నాలుగు వైపులా అడ్డుకట్టారు. భార్య వద్దే భర్త కూర్చుండి పోయాడు. కొందరు మహిళలు గీతకు ఫ్లాట్‌ఫామ్‌లోనే ప్రసవం చూశారు. 
 
ఈ క్రమంలో గీతకు పండంటి పాప పుట్టింది. కాన్పు జరగగానే పోలీసులు మహిళను, శిశువును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా వున్నారని పోలీసులు తెలిపారు. ఇదే విధంగా ఈ ఏడాది సెప్టెంబరులో 27 ఏళ్ల మహిళ భుసవాల్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్‌లోనే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 30 ఏళ్ల మహిళ జూలైలో ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో కవల పిల్లలకు రైలులోనే జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments