Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కువైట్‌కెళ్లిన భర్త... పరాయి వ్యక్తితో లేచిపోయిన భార్య...

Advertiesment
కువైట్‌కెళ్లిన భర్త... పరాయి వ్యక్తితో లేచిపోయిన భార్య...
, శనివారం, 22 డిశెంబరు 2018 (11:00 IST)
మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల బంధానికి విలువేలేకుండా పోతోంది. తాజాగా ఓ మహిళ పరాయి వ్యక్తితో లేచిపోయింది. తనకు ముగ్గురు పిల్లలున్నారనే విషయాన్ని మరిచిపోయి, పరాయి వ్యక్తి మోజులో పడి లేచిపోయింది. ఆమె భర్త తన భార్యాపిల్లల బాగుకోసం నాలుగు రూపాయలు సంపాదించేందుకు దుబాయ్‌కు వెళితే భార్య మాత్రం ఈ పాడుపనికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా కేంద్రంలోని మారుతి నగర్‌కు చెందిన ఎర్రముక్కపల్లె విశ్వనాధపురం అనే వ్యక్తి బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. ఈయన భార్యా, ముగ్గురు పిల్లలను ఇక్కడే వదిలివేసి వెళ్లాడు. 
 
కానీ, భర్త కువైట్‌కు వెళ్లిన పది రోజులకే భార్య మరో వ్యక్తితో లేచిపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తోంది. తన ముగ్గురు పిల్లలను విడిచిపెట్టి ఆ మహిళ వెళ్ళిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని అత్త.. తన కోడలును పిల్లల వద్దకు చేర్చాలని ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌రైట్స్‌ అసోసియేషన్‌ (ఐహెచ్‌ఆర్‌ఏ) జిల్లా కార్యాలయ అధికారులను వేడుకుంటోంది. 
 
తన కుమారుడు కువైట్‌కు వెళ్లిన 10 రోజులకు ఒక వ్యక్తి మా ఇంటికొచ్చి నా కోడలిని నమ్మించి తీసుకెళ్లి శివానందపురంలో కాపురం పెట్టారన్నారు. పిల్లలు దిక్కులేని వారవుతారని తన కోడలును ఇంటికి రావాలని కోరగా తనను చంపుతామని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై సీకేదిన్నె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు అతీగతీ లేదన్నారు. పిల్లలు తల్లి కోసం ఆరాటపడుతున్నారన్నారని, అందువల్ల తన కోడలిని పిల్లల వద్దకు చేర్చాలని బోరున విలపిస్తూ ప్రాధేయపడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో శామ్‌సంగ్ గెలాక్సీ ఏ8ఎస్‌ విడుదల