Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మహత్య చేసుకున్న తమ్ముడు... మరదలిని సజీవన దహనం చేసిన అన్న

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2023 (08:51 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన సొంత సోదరుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని మృతుడి అన్న జీర్ణించుకోలేక పోయాడు. మరదలు పెట్టిన వేధింపుల కారణంగానే తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని భావించిన ఓ వ్యక్తి.. మరదలిని సజీవదహనం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లాకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి ఆర్నెల్ల కిందట ఆత్మహత్య చేసుకున్నడు. అతడి భార్య నిర్మల తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్తగారి ఇంటివద్దే ఉంటున్నారు. అయితే, తమ్ముడి బలవన్మరణానికి నిర్మలే కారణమంటూ మృతుడి అన్న సురేశ్ ఆమెను వేధిస్తూ వచ్చాడు.
 
ఈ క్రమంలో శనివారం ఇనుపరాడ్డుతో ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత నిర్మలపై పెట్రోల్ పోసి నిప్పంటిండాు. "మీ సోదరికి నిప్పంటించాం" అని నిందితుడే మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. భర్త చావుకు తన సోదరే కారణమని, ఆమెను చంపేస్తానని సురేశ్ గతంలోనూ పలుమార్లు బెదిరించారని ఆరోపించారు. దీంతో ఆమెను పుట్టింటికి తీసుకొచ్చేలోపు ఈ దారుణానికి తెగబడ్డాడని మృతురాలి సోదరుడు మీడియాతో వాపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి  విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments