Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తనైనా వదులుకుంటానుగానీ .. ఆమెను వదిలివుండలేను .. బాలికతో ముగ్గురు పిల్లల తల్లి పరార్!

ఠాగూర్
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (08:17 IST)
బీహార్ రాష్ట్రంలోని దర్బంగాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి బాలికతో పారిపోయింది. భర్తనైనా వదులుకుంటానుగానీ, ఆ బాలికను మాత్రం వదులుకోనని చెప్పి మరీ లేచిపోయింది. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకుంది. ఈ పాడుపనికి పాల్పడిన మహిళ పేరు కృతీదేవి. ముగ్గురు బిడ్డల తల్లి. 
 
ఈమెకు 11 యేళ్ల క్రితం కృష్ణ అనే వ్యక్తితో 11 యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆయన రాజస్థాన్ రాష్ట్రంలో కార్మికుడుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పటాహీ గ్రామానికి చెందిన ఓ బాలికతో కృతీదేవికి ఫోనులో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త కృష్ణ.. భార్యను మందలించాడు. పద్దతి మార్చుకోవాలని పదేపదే హెచ్చరించసాగాడు. 
 
అయితే, ఆ మహిళ మాత్రం.. తన పద్దతి మార్చుకోకపోగా, అవసరమైతే నిన్ను వదిలేస్తాగానీ, ఆ బాలికను మాత్రం వదిలివేసే ప్రసక్తే లేదని భర్తకు తెగేసి చెప్పింది. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన ఆ బాలికతో ఆ మహిళ పారిపోయింది. దీనిపై మహిళ భర్తతో పాటు బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, కృతీదేవి, బాలికను శనివారం అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments