మాతృత్వానికే మాయని మచ్చ.. మైక్రో ఓవెన్‌లో పెట్టి..?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (17:05 IST)
మాతృత్వానికే మాయని మచ్చ తెచ్చింది. కన్నబిడ్డను అత్యంత దారుణంగా హత్య చేసింది. రెండు నెలల పసిగుడ్డును అత్యంత దారుణంగా గొంతు నులిమి చంపి ఆ తరువాత మృతదేహాన్ని మైక్రో ఓవెన్‌లో పెట్టి కాల్చింది. ఈ అత్యంత దారుణం ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే., ఢిల్లీలోని మాలవీయ నగర్​లో రెండు నెలల కన్నకూతుర్ని గొంతు నులిమి దారుణంగా హత్య చేసి చిన్నారి మృతదేహాన్ని ఒవెన్​లో పెట్టింది. 
 
మాలవీయ నగర్​లోని చిరాగ్ ఏరియాలో గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంప‌తుల‌కు రెండు నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని డింపుల్ బిడ్డ గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత వంట గదిలోని మైక్రోఓవెన్‌లో పెట్టింది. 
 
ఈ దృశ్యాలను వేరే గదిలో ఉన్న చిన్నారి నానమ్మ చూడటంతో బిగ్గరగా అరిచింది. దీంతో స్థానికులు ఆమె అరుపులకు పరుగులు తీసుకుంటూ వచ్చినా ఆ చిన్నారిని కాపాడలేకపోయారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్‌ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments