ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా 'నేషన్ మూడ్' : శరద్ పవార్

ఠాగూర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (09:51 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇపుడు దేశం మూడు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నేషన్ మూడ్ మారుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయని తెలిపారు. 
 
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై ఇంకా ఆలోచన చేయలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి లోక్‌సభ స్థానాల పంపకాలపై ప్రశ్నించగా, తానేమీ జ్యోతిష్యుడిని కాదన్నారు. ప్రధాని మోడీ చిన్న చిన్న అంశాలపై దృష్టిసారిస్తున్నారని, కానీ, వేలాది చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే ఆయన మాత్రం మౌనంగా ఉండిపోతున్నారని వ్యాఖ్యానించారు. పైగా, ఇందిరా గాంధీ విమర్శలు గుప్పిస్తూ, జాతి ప్రయోజనాలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 
 
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఆయన స్పందిస్తూ, సంజయ్ సింగ్‌ను అరెస్టు చేసి అతడికి అన్యాయం చేశారని, ఇపుడు ఆయన విడుదల కావడం శుభపరిణామమన్నారు. ఆయన విడుదల కావడంతో ఇపుడు దేశం యావత్‌కు నిజం తెలుస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments