మాస్కో ఉగ్రదాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది హేయమైన చర్య అని అన్నారు. మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మా ప్రార్థనలు బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలి. ఈ విషాద ఘటనలో రష్యన్ ప్రజలకు భారత్ మద్దుతుగా నిలుస్తుందని ట్వీట్‌లో స్పందించారు.
ఈ ఘటనలో 60 మందిని ప్రాణాలు కోల్పోయారు. దాడికి తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించింది. గత రెండేళ్లుగా రష్యాపై ఐసిస్-కే దృష్టి సారించిందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రచారంలో తరచూ విమర్శిస్తున్నారు.
ఇదే విషయాన్ని న్యూయార్క్‌కు చెందిన సెక్యూరిటీ కన్సల్టింగ్ సంస్థ సౌఫాన్ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విశ్లేషకుడు కొలిన్ పి క్లార్క్ తెలిపారు.