Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనంటున్న చైనా.. ప్రధాని మోడీ పర్యటన సబబు కాదు...

sela tunnel

ఠాగూర్

, సోమవారం, 18 మార్చి 2024 (09:08 IST)
డ్రాగన్ కంట్రీ చైనా మరోమారు భారత్‌పై తన అక్కసు వెళ్ళగక్కింది. భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్  తమ భూభాగమేనంటూ ప్రకటించింది. ఈ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించడం ఏమాత్రం సబబు కాదని పేర్కొంది. పైగా, భారత్ చర్యలు ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు అనుకూలం కాదంటూ వ్యాఖ్యానించింది. చైనా వ్యాఖ్యలను భారత్ ముక్తకంఠంతో ఖండించింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సెలా సొరంగమార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పర్యటనపై చైనా తీవ్ర అభ్యంతరం చెప్పగా, కమ్యూనిస్టు దేశం వాదనలను భారత్ తిప్పికొట్టింది. దీనిపై స్పందించిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలోని ప్రాంతమైనని తాజాగా ప్రకటించింది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తాము ఎప్పటికీ గుర్తించమని స్పష్టం చేసింది. 
 
గత కొంతకాలంగా డ్రాగన్ కంట్రీ విస్తరణవాదంతో రెచ్చిపోతుంది. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు కుయుక్తులు పన్నుతుంది. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. తాజాగా మరోమారు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం తమదేనంటూ వ్యాఖ్యానించింది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తాము ఎప్పటికీ గుర్తించమని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి మిలిటరీ సన్నద్ధతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం సెలా టన్నెల్ నిర్మించిన విషయం తెలిసిందే. సరిహద్దు వెంబడి సైన్యాల తరలింపునకు ఈ టన్నెల్ ఎంతో ఉపకరిస్తుంది. అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే సెలా సొరంగ మార్గం దేశభద్రత రీత్యా అత్యంత కీలకంగా మారింది. 13 వేల అడుగుల ఎత్తున ఈ సొరంగ మార్గం ప్రపంచంలోనే అతిపెద్ద బైలేన్ టన్నెల్‌గా పేరుగాంచింది.
 
ఇదిలావుంటే, నరేంద్ర మోడీ పర్యటనపై అప్పట్లో చైనా పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం రక్షించుకునే క్రమంలో తాము నిత్యం అప్రమత్తంగా ఉంటామని చైనా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. భారత్ చేపడుతున్న చర్యలు సరిహద్దు వెంబడి శాంతిస్థాపనకు అనుకూలం కాదని అన్నారు. అయితే, చైనా వాదనలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ భూభాగమేనని ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. చైనా పెట్టుకునే ఉత్తుత్తి పేర్లు క్షేత్రస్థాయిలో వాస్తవాలను మార్చబోవని ఇప్పటికే ఘాటుగా బదులిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ జగన్ మీ దత్తపుత్రుడు కాదు.. పదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసి.. ఇపుడు మాపై నిందలా...