Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా ఉధృతి : మే 15వరకు చారిత్రక కట్టడాల మూసివేత

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (08:23 IST)
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఫలితంగా వచ్చే నెల 15వ తేదీ వరకు చారిత్రక కట్టడాలను మూసివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పరీక్షలు రద్దు చేసిన కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
 
దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియంలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. 
 
కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియంలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాజ్ మహల్, పతేహ్ పూర్ సిక్రి, తదితర కట్టడాల సందర్శనకు అనుమతి లేదన్నారు. 
 
గత సంవత్సరం కూడా కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్న వేళ ఈ కట్టడాలన్నీ మూసివేశారు. ఆ తర్వాత వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేశారు. అయితే, తాజాగా, గతంలో కంటే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతుండటంతో మరోసారి ఆంక్షలు అమలు చేస్తున్నారు. 
 
దేశంలో రోజువారీ కొవిడ్ కేసులు 2 లక్షలకుపైగా నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కట్టడి కోసం కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. కొత్త ఆంక్షలను కూడా అమల్లోకి తీసుకొస్తున్నాయి. దేశంలో 3691 స్మారక కట్టడాలను ఏఎస్ఐ పర్యవేక్షిస్తుంది. వాటిలో 143 స్మారక కట్టడాలు సందర్శనకు అనుమతి ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 170 చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో కేవలం 13 కట్టడాలకు మాత్రమే సందర్శనకు అనుమతి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments