దోబూచులాడుతున్న నైరుతి.. మరింత ఆలస్యం కావొచ్చంటున్న ఐఎండీ

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (14:50 IST)
దేశంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం మరింత ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. 
 
వాస్తవానికి వర్షాలు గత కొన్ని రోజులుగా దూబూచులాడుతున్నాయి. అదేసమయంలో నైరుతి రుతుపవనాలు జూన్ నాలుగో తేదీ నాటికే కేరళ తీరాన్ని తాకుతాయని తొలుత అంచనా వేసింది. కానీ, ఈ అంచనాలు తారుమారయ్యాయి. జూన్ ఏడో తేదీ నాటికి రుతుపవనాలు కేరళను చేరుకుంటాయని తెలిపింది. ఆ తర్వాత అక్కడ నుంచి కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాయని వెల్లడించింది.
 
"దక్షిణ అరేబియా సముద్రంపై పశ్చిమాది గాలులు పెరుగుతుండటంతో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. పడమర గాలుల తీవ్ర ఆదివారం నుంచి మరింతగా పెరిగింది. సముద్ర ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తుకు జూన్ 4వ తేదీన చేరాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంపైనా మేఘాలు వ్యాప్తి పెరుగుతోంది. ఈ అనుకూల పరిస్థితులతో రుతుపవనాలు వచ్చే మూడు నాలుగు రోజుల్లో మరింత పురోగమిస్తాయి" అని తెలిపింది. 
 
కాగా, ఈ యేడాది ఎల్ నినో ప్రభావం ఉంటున్నప్పటికీ సాదారణ వర్షాలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ లోగడ ప్రకటించిన విషయం తెల్సిందే. గత 2022లో నైరుతి రుతుపవనాలు మే 29వ తేదీన కేరళ తీరాన్ని తాకగా, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న చేరుకున్నాయి. ఈ ప్రకారంగా ఈ యేడాది ఇప్పటికే ఆలస్యమైనట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments