Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా శాంపిల్స్‌ను కోతులు ఎత్తుకెళ్లిపోయాయి.. వాటికి కోవిడ్ వస్తుందా?

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (19:50 IST)
మీరట్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇంతకీ ఏమైందంటే..  కొన్ని కోతులు కరోనా వైరస్ టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్లిపోయాయి. కరోనా వైరస్ పరీక్షలు జరిపిన తర్వాత ఆ టెస్ట్ కిట్లను ఓ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుని వెళ్తుండగా కోతుల మూక దాడి చేసి ఆ టెస్ట్ కిట్లను ఎత్తుకుపోయింది. 
 
ముగ్గురు కరోనా అనుమానితులకు చేసిన టెస్ట్ శాంపిల్స్ అందులో ఉండిపోయాయి. ప్రస్తుతం ఆ శాంపిల్స్ కోతుల వద్ద ఉండడంతో వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆ కోతి మూక దాడి చేసి కరోనా టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు కూడా కొన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. 
 
అందులో ఓ కోతి శాంపిల్ కిట్‌ను కొరుకుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. దీంతో కోతులను పట్టుకోవాలంటూ డాక్టర్లు అటవీ శాఖ అధికారుల సాయం కోరారు. ఈ శాంపిల్ ద్వారా కోతులకు కరోనా వచ్చే ప్రమాదం వుందని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments