Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో యాంకర్ దుర్మరణం... నటుడు సేఫ్...

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మోడల్‌, యాంకర్ దుర్మరణం పాలైంది. ఓ నటుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయానికి ఎ

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (06:41 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మోడల్‌, యాంకర్ దుర్మరణం పాలైంది. ఓ నటుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయానికి ఎయిర్‌బ్యాగ్స్ పని చేయక పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అలాగే, ఈ ప్రమాదంలో నటుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదం శనివారం జరిగింది. 
 
ప్రమాదంలో చనిపోయిన నటి పేరు సోనికా చౌహాన్. వయసు 28 యేళ్లు. గాయపడిన నటుడు విక్రమ్‌ చటర్జీ. విక్రమ్‌ చటర్జీతో కలిసి.. కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శనివారం జరిగింది. కారులో చిక్కుకున్న విక్రయ్‌.. తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని అతి కష్టం మీద బయటకు తీశారు. తలకు తీవ్రగాయం కాగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఉత్తర కోల్‌కతాలోని రాష్‌బెహరీ అవెన్యూదగ్గర లాకేమాల్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు అత్యంత వేగంగా వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ కారులో ఉన్న ఎయిర్‌ బ్యాగ్స్‌ పని చేయకపోవడంతో.. ఆమె మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈమె బిగ్ బాస్‌కు హోస్ట్‌గా కూడా వ్యవహరించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments