Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ను చూసేందుకు వచ్చింది.. నృత్య దర్శకుడి చేతిలో బలైపోయింది...

భాగ్యనగరంలో విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు వచ్చిన ఆ విద్యార్థిని ఓ నృత్యదర్శకుడు, అతని అనుచరుల చేతిలో రేప్‌కు గురైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరి

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (06:32 IST)
భాగ్యనగరంలో విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు వచ్చిన ఆ విద్యార్థిని ఓ నృత్యదర్శకుడు, అతని అనుచరుల చేతిలో రేప్‌కు గురైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్ నగర అందాలను తిలకించేందుకు విమానంలో ఎయిర్ పోర్టుకు వచ్చింది. అక్కడ పింకీ అనే యువతి పరిచయమైంది. తాను కూడా పర్యాటకురాలినేనని నమ్మించింది. తనతో వస్తే హైదరాబాద్‌ మొత్తం తిప్పి చూపిస్తానని చెప్పింది. ఆపై వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని తన అపార్ట్‌మెంటుకు తీసుకెళ్లింది. 
 
ఈ గదిలో పింకీ స్నేహితుడు, నృత్య దర్శకుడిగా పనిచేస్తున్న ప్రీత్ సెర్గిల్, మరో నలుగురితో కలసి ఆమెపై లైంగిక దాడులకు దిగాడు. పైగా గదిలో బంధించారు. మూడు రోజుల అనంతరం, తనకు దొరికిన టిష్యూ పేపర్ జరుగుతున్న విషయాన్ని రాసి, కిటికీ నుంచి బయటకు విసిరేసింది. 
 
దీన్ని చూసిన ఇరుగు, పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు రంగ ప్రవేశం చేసి.. ఆమెను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు, కొరియోగ్రాఫర్ ప్రీత్‌ సెర్గిల్‌‌ను అరెస్ట్ చేశారు. పింకీ సహా మిగతావారు పారిపోయారని, వారికోసం గాలిస్తున్నామని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం