Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడల్ హత్య కేసు.. కోరిక తీర్చలేదని.. అలా చేశాడట.. ఛార్జీషీట్?

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (11:53 IST)
మోడల్ హత్య కేసులో ముంబై పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేశారు. కోరిక తీర్చలేదనే కసితో గొంతుకు తాడు బిగించి నిందితుడు చంపేశాడు. ఈ ఘటన గత ఏడాది అక్టోబర్ 15వ తేదీన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గొప్ప మోడల్‌గా ఎదగాలనుకున్న వర్ధమాన మోడల్ మన్సీ దీక్షిత్ (20)ను నిందితుడు సయ్యద్ ముజమ్మిల్ (19) కోరిక తీర్చలేదనే అక్కసుతో హత్య చేశాడు. మోడల్‌తో పరిచయం పెంచుకున్న ఫొటోగ్రాఫర్ ముజమ్మిల్ ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు. 
 
ఇందులో భాగంగా ఫొటోలు తీసే నెపంతో తన ఇంటికి పిలిచాడు. ఇంటికొచ్చిన ఆమెను తన కోరికను తీర్చాలన్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైన ఫోటోగ్రాఫర్... స్టూలుతో తలపై కొట్టాడు. ఆపై తాడుతో మెడను బిగించి చంపేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ సంచిలో మూటకట్టి, క్యాబ్ బుక్ చేసుకుని ఓ ఫుట్ పాత్ వద్ద పడేసి పారిపోయాడు. 
 
కానీ ఆ సంచిలో మృతదేహం వుందని గమనించిన క్యాబ్ డ్రైవర్ ఆ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ముజమ్మిల్‌ను అరెస్ట్ చేశారు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఛార్జీషీట్ దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments