Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి పురుడు పోసిన ఎమ్మెల్యే

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (09:59 IST)
Mizoram MLA
పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఎమ్మెల్యే పురుడు పోశారు. ఎమ్మెల్యే సమయానికి స్పందించడంతో.. బాధిత మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎమ్మెల్యే చొరవతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన మిజోరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిజోరంలోని చాంఫై నార్త్‌ ఎమ్మెల్యే జడ్‌ఆర్‌ థైమ్సంగా సోమవారం తన నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. 
 
ఇటీవల సంభవించిన భూకంపాలు, కరోనా వైరస్‌ తీవ్రతతో పాటు ఇతర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలోనే నాగూర్‌ గ్రామంలో నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేకు సమాచారం అందింది. 
 
వృత్తిరీత్యా గైనకాలజీస్ట్ అయిన థైమ్సంగా చాంఫై ఆస్పత్రికి వెళ్లి ఆమెకు పురుడు పోశారు. గర్భిణికి ఎమ్మెల్యే సీజేరియన్‌ చేశారు. చాంఫై ఆస్పత్రి డాక్టర్‌ అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments