మాజీ మంత్రి స్వామి చిన్మయానంద కాలేజీలో విద్యార్థిని అదృశ్యం... గాలిస్తే....

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఈ రాష్ట్రంలోనే నేరాలు ఘోరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే నిత్య నేరాలకు యూపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే ప్రచారం సాగుతోంది. తాజాగా కనిపించకుండా పోయిన ఓ కాలేజీ అమ్మాయి 60 శాతం కాలిన గాయాలతో రోడ్డు పక్కన నగ్నంగా కనిపించింది. 
 
ఈ విద్యార్థిని కేంద్రమాజీ మంత్రి స్వామి చిన్మయానంద ఆధ్వర్యంలోని సుఖ్‌దేవానంద్ కాలేజీలో బీఏ రెండో ఏడాది చదువుతోంది. ప్రస్తుతం ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో ఏం జరిగిందన్న విషయం ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
 
కాగా, సోమవారం తండ్రితో కలిసి కాలేజీకి వచ్చిన యువతి కళాశాల ముగిసినా బయటకు రాకపోవడంతో తండ్రి ఆందోళన చెందాడు. ఆమె కోసం వెతుకుతున్న సమయంలో లక్నో-బరేలీ జాతీయ రహదారి పక్కన పడి ఉన్నట్టు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు 60 శాతం కాలిన గాయాలతో, నగ్నంగా పడి ఉన్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
షాజహాన్‌పూర్‌లోనే జరిగిన మరో ఘటనలో చెరువు వద్దకు వెళ్లిన ఐదేళ్ల బాలిక, ఆమెకు సోదరి వరుసయ్యే ఏడేళ్ల బాలిక అదృశ్యమయ్యారు. వారి కోసం వెతుకుతున్న సమయంలో ఐదేళ్ల బాలిక సమీపంలోని పొలంలో విగతజీవిగా కనిపించింది. మరో బాలిక తీవ్రంగా గాయపడి ఉంది. మరో ఘటనలో రాష్ట్రంలోని లిఖింపూర్‌లో సోమ, మంగళవారాల్లో నలుగురు కాలేజీ విద్యార్థినులు అదృశ్యమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments