Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటో డ్రైవర్‌తో పారిపోయింది.. చివరికి భర్తతో కలిసివుండాలని వచ్చేసింది...

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:37 IST)
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఖజ్రానా పోలీస్ స్టేషన్ ఏరియాలో నివసిస్తున్న 45 ఏళ్ల మహిళ , కొంతకాలం క్రితం ఇంటి నుండి రూ. 47 లక్షలతో తన ప్రేమికుడైన ఆటో డ్రైవర్‌తో పారిపోయింది.  అయితే ఉన్నట్టుండి.. సోమవారం అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చిన మహిళ.. పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసింది.

తన భర్తతో కలిసి జీవించాలనుకుంటున్నట్లు ఆ మహిళ తెలిపింది. అదే సమయంలో, మహిళ భర్త కూడా ఆమెతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే రూ.34 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కాగా మహిళ ప్రేమికుడు ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
 
వివరాల్లోకి వెళితే.. ఖజ్రానా ప్రాంతానికి చెందిన ఓ ప్రాపర్టీ బ్రోకర్ భార్య, 13 ఏళ్ల చిన్నవాడైన ఆటో డ్రైవర్‌తో కలిసి అక్టోబర్ 13న ఇంట్లోని రూ.47 లక్షలతో పారిపోయిందని ఖజ్రానా పోలీస్ స్టేషన్ సీఎస్పీ జయంత్ రాథోడ్ తెలిపారు. 34 లక్షలను నిందితుడు తన ఇద్దరు స్నేహితులకు ఇచ్చాడు. ఆటో డ్రైవర్‌ స్నేహితుడు రితేష్‌ ఠాకూర్‌, ఫుర్కాన్‌ల నుంచి పోలీసులు ముందుగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మహిళను, ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు పలు చోట్ల దాడులు చేశారు. అయితే ఇద్దరూ పోలీసులకు దొరకలేదు. సోమవారం రాత్రి ఆ మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ సోమవారం అర్థరాత్రి ఖజ్రానా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఇక్కడ పోలీసులు మహిళను కొన్ని గంటల పాటు విచారించారు. ప్రేమికుడు మహిళ కంటే 13 సంవత్సరాలు చిన్నవాడు. భర్త తనను వేధించేవాడని మహిళ పోలీసులకు తెలిపింది. అందుకే ఇంటి నుంచి పారిపోయింది. అయితే ఇప్పుడు ఆమె తన భర్త తో కలిసి జీవించాలనుకుంటోంది. మొత్తానికి భర్త కూడా భార్యతోనే ఉండాలనుకుంటాడు. డబ్బు అయిపోయింది కానీ భార్య నగలు తెచ్చిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments