Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్లపై ఉగ్రవాదుల కన్ను

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (07:54 IST)
ఉగ్రవాదులు రైల్వే స్టేషన్లను టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైల్వే స్టేషన్లపై దాడులకు టెర్రరిస్టులు ప్రణాళిక రచించారని వార్నింగ్ ఇచ్చాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది.

దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను పెంచారు. కీలకమైన రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. స్థానిక పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా సోదాలు చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల ను అదుపులోకి తీసుకున్నారు.

జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన మసూద్, అహ్మద్ పేరుతో రోహ్‌తక్ రైల్వే పోలీసులకు లేఖ వచ్చింది. అక్టోబర్ 8న రైల్వే స్టేషన్లలో దాడులు చేయబోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.

దాంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని స్టేషన్లలో అదనపు బలగాలను మోహరించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం