Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా విలయం ... క్యూ కట్టిన వలస కూలీలు

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (12:29 IST)
మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది. ప్రతి రోజూ 50 వేల పైచిలుకు కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తోంది. అలాగే, నైట్ కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. అనేక ఆంక్షలు విధించింది. కరోనా నిబంధనలను కూడా చాలా కఠినంగా అమలుచేస్తున్నారు. అయినా కూడా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గకపోవడంతో.. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు సొంత రాష్ట్రాల దారి పడుతున్నారు. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారన్న భయంతో వారిలో నెలకొనడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 
 
తాజాగా గురువారం ముంబై నుంచి యూపీలోని గోరఖ్‌పూర్ బయలుదేరిన ట్రైన్‌లో వెళ్లిన ప్రయాణికులే అందుకు ఉదాహరణ. లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి గోరఖ్‌పూర్ బయలుదేరిన ట్రైన్‌లో వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. 
 
ఆ ట్రైన్‌లో నిలబడటానికి కూడా ఖాళీ లేకుండా జనాలు ఎక్కారు. కరోనా దెబ్బకు మళ్లీ వలస కార్మికులు సొంతూర్లకు వెళ్లిపోతుండటంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కాగా.. వలస కార్మికులు కూడా పని వదిలి వెళ్లిపోతూ.. తమ పరిస్థితి ఏంటో అని ఆవేదన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం నుంచి ఆడ పిశాచం.. సాంగ్ రిలీజ్

అచ్చ తెలుగులో స్వచ్ఛమైన ప్రేమ కథ కాలమేగా కరిగింది : దర్శకుడు శింగర మోహన్

దేవునికిచ్చిన మాట ప్రకారం బ్యాడ్ హ్యాబిట్స్ దూరం : సప్తగిరి

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments