Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా ఛాన్స్‌లిప్పిస్తానని రెండేళ్ళుగా అత్యాచారం.. వర్థమాన నటి కలల్ని చిదిమేశాడు!

ఓ వర్థమాన నటి సినిమా కలలను ఓ కామాంధుడు చిదిమేశాడు. ఘజియాబాద్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో విద్యను అభ్యసించిన 17 యేళ్ల వర్థమాన నటికి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి.. రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చిన ఘ

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (11:36 IST)
ఓ వర్థమాన నటి సినిమా కలలను ఓ కామాంధుడు చిదిమేశాడు. ఘజియాబాద్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో విద్యను అభ్యసించిన 17 యేళ్ల వర్థమాన నటికి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి.. రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
17 యేళ్ళ యువతి 2014 జూలైలో ఆమె ఘజియాబాద్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో చేరింది. బాలీవుడ్‌ గ్లామర్‌ ప్రపంచంలో అడుగుపెట్టాలని, నటిగా రాణించాలని కలలు కంది. స్నేహితుడి ముసుగులో ఓ వ్యక్తి ఆమెకు సునీల్‌ కులకర్ణిని పరిచయం చేశాడు. తన సినీ పరిశ్రమలో చాలామందితో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి బాధిత మైనర్‌ బాలికను ట్రాప్‌ చేశాడు. ఆ తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులకు కూడా నచ్చజెప్పి ఆ యువతిని తన వెంట తీసుకెళ్లాడు. అలా కొద్దిరోజులు ఢిల్లీలో, మరికొన్ని రోజులు ముంబైలలో ఉంటూ ఆమెను లైంగికంగా వాడుకున్నాడు. 
 
ఈ క్రమంలో ఆమెతో శృంగారంలో ఉన్నపుడు పలు వీడియోలు, ఫోటోలు తీశాడు. వీటిని చూపి ఆమెపై అత్యాచారం చేయడమే కాకుడా, మరికొందరి వద్దకు కూడా పంపించసాగాడు. చివరకు... బాధితురాలు ఢిల్లీ వసంత్‌  కుంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు బాధితురాలిపై అత్యాచారం జరిపిన మరో నిందితుడిని పట్టుకునేందుకు కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం