Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు... అడ్వకేట్లు.. అధికారులు అరెస్టు?

రాజస్థాన్‌ రాష్ట్రంలో వెలుగు చూసిన భారీ సెక్స్ రాకెట్‌లో పెద్ద తలలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో అమ్మాయిలతో పాటు అరెస్టు అయిన వారిలో అడ్వకేట్లు, అధికారులు కూడా ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రానిక

Webdunia
గురువారం, 18 మే 2017 (08:14 IST)
రాజస్థాన్‌ రాష్ట్రంలో వెలుగు చూసిన భారీ సెక్స్ రాకెట్‌లో పెద్ద తలలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో అమ్మాయిలతో పాటు అరెస్టు అయిన వారిలో అడ్వకేట్లు, అధికారులు కూడా ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన షికా తివారీ అనే యువతి ముంబైలోని ఓ హోటల్‌లో డీజేగా పని చేస్తోంది. ఈమె సారథ్యంలోని కొంతమంది అమ్మాయిలతో సెక్స్ గ్యాంగ్ ఏర్పాటైంది. ఈ క్రమంలో జైపూర్‌కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ను ట్రాప్‌ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ ఆమెను అదుపులోకి తీసుకున్నారు.   
 
ఈ సెక్స్ రాకెట్ గ్యాంగ్‌కు చెందిన యువతులు సంపన్నులతో పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత క్లోజ్‌గా మూవ్‌ అవ్వడం. అనంతరం రూమ్‌కి పిలిచి, వారితో ఏకాంతంగా గడిపి, రేప్‌ కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడటం ఈ గ్యాంగ్‌ స్టైల్‌. ఈ సెక్స్‌ రాకెట్‌ గ్రూప్‌ దాదాపు ఏడాది నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. 
 
ఈ గ్యాంగ్ ఇప్పటివరకు సుమారు రూ.20 కోట్లకుపైగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఆరుగురు యువతులతో సహా మొత్తం 33న మందిని స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ అరెస్ట్‌ చేసింది. అరెస్టయిన వారిలో ఆరుగురు లాయర్‌లు కూడా ఉన్నారు. అంతేకాకుండా, పలువురు రాజకీయ నేతలు కూడా ఈ సెక్స్ రాకెట్ బాధితుల్లో ఉన్నట్టు సమాచారం. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం