Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీవు లేకపోతే బతకలేనన్నాడు... నమ్మి వెంట నడిస్తే ఫ్రెండ్‌తో కలిసి రేప్ చేశాడు... ఎక్కడ?

తెలంగాణా రాష్ట్రంలో ఇద్దరు మైనర్ బాలికలు కామాంధులు చేతిలో మోసపోయారు. ప్రేమిస్తున్నానని నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశారు. వారి మాటలు నమ్మి వెంట నడిచినందుకు శీలాన్ని కోల్పోయారు. తాజాగా వెలు

Webdunia
గురువారం, 18 మే 2017 (07:54 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఇద్దరు మైనర్ బాలికలు కామాంధులు చేతిలో మోసపోయారు. ప్రేమిస్తున్నానని నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశారు. వారి మాటలు నమ్మి వెంట నడిచినందుకు శీలాన్ని కోల్పోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ రెండు మైరన్ బాలికల అత్యాచార కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, పాత బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన బాలిక(15)పదో తరగతి పూర్తిచేసి ఇంటివద్దే ఉంటోంది. రాజు అనే క్యాబ్‌ డ్రైవర్‌తో ఆమెకు కొద్దిరోజుల క్రితం పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని బాలికను నమ్మించాడు. నీవు లేకపోతే నేను జీవించలేనన్నాడు. పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాడు. దీంతో అభంశుభం తెలియని ఆ బాలిక ఆ కామాంధుడి మాటలు నమ్మింది. ఆ తర్వాత షికారు పేరుతో కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై తన స్నేహితుడి కిరణ్‌తో కలిసి అత్యాచారం చేశాడు క్యాబ్ డ్రైవర్. 
 
ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అయితే, తమ బిడ్డ ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిన విషయం చెప్పి బోరున విలపించింది. ఆ తర్వాత బోయిన్‌పల్లి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
అలాగే, పెళ్లిచేసుకుంటానని మైనర్‌ను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంజయ్యనగర్‌లో నివాసముండే ఉమేష్‌ (22) స్థానికంగా ఉంటున్న మైనర్‌పై అత్యా చారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments