Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకుడికి చికెన్, మటన్, చేపలు, విస్కీ నైవేద్యంగా పెడతారట.. ఎక్కడో తెలుసా?

వినాయకునికి పూజంటే శాకాహారానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. పత్రపూజతో పాటు వినాయక చవితిని దేశ వ్యాప్తంగా ఎంతో పవిత్రంగా అట్టహాసంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితి రోజున విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు, పుల

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (13:03 IST)
వినాయకునికి పూజంటే శాకాహారానికి చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. పత్రపూజతో పాటు వినాయక చవితిని దేశ వ్యాప్తంగా ఎంతో పవిత్రంగా అట్టహాసంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితి రోజున విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు, పులిహోర, పరవాన్నం, పండ్లను నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు.

ఐతే కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లాలో ఓ విచిత్ర ఆచారం వుంది. అదేంటంటే… అక్కడి ప్రజలు గణేశుడికి మాంసం, మద్యం నైవేద్యంగా పెడతారట. ఈ గ్రామానికి చెందిన క్షత్రియ తెగకు చెందిన వంద కుటుంబాల వారు గణేశుడిని మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పించి పూజిస్తారట. 
 
ఇలా చేయడం ద్వారా గణేశుడు ఆనందిస్తాడని, తమకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని వారి విశ్వాసం. కేవలం కాయగూరలతో వండిన ప్రసాదం గణేశుడు సంతృప్తి చెందడని, అందుకే మాంసం, మద్యం కూడా నైవేద్యం పెడతామని ,ఇది మా కుటుంబాలకు అనాదిగా వస్తున్న ఆచారమని ఆ గ్రామస్తులు చెప్తున్నారు.
 
చికెన్, విస్కీలను నైవేద్యంగా పెడితే గణేశుడు సంతోషాలను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని.. తాత ముత్తాతల కాలం నుంచే ఈ ఆచారం ఉందని ఆ గ్రామానికి చెందిన 30ఏళ్ల వ్యక్తి రఘుభవికట్టి తెలిపాడు. ఐదు రోజులపాటు గణేష చతుర్థిని జరుపుకుంటామని మూడో రోజూ మాంసాహారాన్ని సమర్పిస్తామని  చెప్పాడు. వీటితో పాటు మటన్, చేపల వంటకాలను కూడా  ఆ రోజు సమర్పిస్తామన్నాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments