Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్‌డొనాల్డ్స్‌కు రూ.6 కోట్ల అపరాధం.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (13:54 IST)
చికెన్‌ నగెట్స్‌ తిందామని ఆశపడిన చిన్నారికి.. విపరీతమైన వేడిగా ఉన్న ఆహారం అందించినందుకు ప్రముఖ ఫుడ్‌ చెయిన్‌ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌ కంపెనీకి భారీ అపరాదాన్ని వడ్డించారు. ఇది అమెరికాలో చోటు చేసుకుంది. ఒలివియా కారబల్లో అనే నాలుగేళ్ల చిన్నారి 2019లో ఫ్లొరిడాలోని ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ సమీపంలో మెక్‌డొనాల్డ్స్‌ డ్రైవ్‌ ఇన్‌కు వెళ్లి, అక్కడ హ్యాపీ మీల్‌ను కొనుగోలు చేసింది. దానిని తినేందుకు కారులో బాక్స్‌ తెరవగా విపరీతమైన వేడిగా ఉన్న ఓ నగెట్‌ ఆమె కాలుపై పడింది. 
 
ఈ ఘటనలో ఆమె కాలుకు స్వల్ప గాయమైంది. దీనికితోడు ఆమె భయంతో చాలా సేపు ఏడుస్తూనే ఉంది. దీంతో ఒలివియా కుటుంబ సభ్యులు మెక్‌డొనాల్డ్స్‌పై ఫ్లొరిడాలోని న్యాయస్థానంలో కేసు ఫైల్‌ చేశారు.
 
కోర్టుకు చిన్నారి గాయం ఫొటోలు, ఆ సమయంలో పాప బాధతో ఏడుస్తున్న ఆడియోను అందించారు. 
 
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ చిన్నారికి గతంలో పడిన ఇబ్బందికి నాలుగు లక్షల డాలర్లు.. భవిష్యత్తు కోసం మరో నాలుగు లక్షల డాలర్లు చెల్లించాలని మెక్‌డొనాల్డ్స్‌ను ఆదేశించింది. 
 
ఇది భారత కరెన్సీలో రూ.6.5 కోట్లకు సమానం.
ఈ కేసులో మెక్‌డొనాల్డ్స్‌ తరపు లాయర్‌ స్పందిస్తూ.. కాలిన గాయం మూడు వారాల్లో తగ్గిన తర్వాత నొప్పి కూడా పోయిందని బాధితురాలి కుటుంబీకులు చెప్పారని వాదించారు. ఆమెకు 1.56 లక్షల డాలర్లు సరిపోతాయన్నారు. 
 
ఆ పాప ఇప్పటికీ మెక్‌డొనాల్డ్స్‌ ఔట్‌లెట్లకు వెళ్లి చికెన్‌ నగెట్లను తింటోందని చెప్పారు. కానీ, న్యాయస్థానం మాత్రం 8,00,000 డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments